స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలోనే గుంటూరు జిల్లా పల్నాడులో దాడులు మొదలయ్యాయి. వెల్దుర్తి మండలం బోదిలవీడులో వైకాపా నేత నంబూరి కృష్ణమూర్తిపై దుండగులు దాడి చేశారు. గొడ్డలి, బీరు బాటిల్తో దాడి చేసినట్లు వివరించారు. స్థానిక ఎన్నికల్లో పోటీచేసేందుకు తాను సిద్ధం కావటం వల్లే.. తెదేపాకు చెందిన వారు తనపై దాడి చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి ఘటనపై వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి...