youth preparing well for competitive exams: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలుశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ప్రధానంగా పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, రవాణాశాఖల్లో భారీగా ఖాళీలు భర్తీచేయనుంటంతో వాటి సాధించేందుకు అభ్యర్థులు తీవ్రంగాశ్రమిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ప్రభుత్వఉద్యోగం కోసం యువత తలమునకలైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈసారి ప్రభుత్వ కొలువుసాధించడమే లక్ష్యమని వారు చెబుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు మహిళలు, పురుషులు మైదానాల్లో సందడి చేస్తున్నారు. ఈసారి మహిళలు, పురుషులకు పరుగుపందెంలో మార్పులు చేసినందున.. ఉదయం నుంచి వ్యాయామాలు, ఇతర కసరత్తులు చేస్తూ తీవ్రంగా చెమటోడుస్తున్నారు. పరుగుపందెంతోపాటు మెయిన్స్‌లో సత్తాచాటేలా పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు.
మహిళలకు ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో.. భారీగా మైదానాల్లో కసరత్తు చేస్తున్నారు. వారిలో అధికశాతం మంది తమ భర్తలు, పిల్లలను విడిచి నగరాల్లో ఉంటూ ప్రభుత్వ కొలువల కోసం తపిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే మైదానాలు యువతతో కిక్కిరిసి పోతున్నాయి. కొంతమంది స్నేహితులంతా కలిసి గ్రూపుగా ఏర్పడి పోటాపోటీగా కష్టపడుతున్నారు.
ఇవీ చదవండి: