గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో అనధికార రేషన్ బియ్యం తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. పుర్లమెరక గ్రామ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా మినీ లారీలో రవాణా చేస్తున్న 180 రేషన్ బియ్యం బస్తాలను అడవులదీవి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాని తరలిస్తున్న ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకన్నట్లు ఎస్సై హరిబాబు వెల్లడించారు. బియ్యాన్ని ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు... ఎవరి దగ్గర నుంచి తీసుకువస్తున్నారనే అంశాలంపై నిందుతులను విచారిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'రాజధానిపై సరైన సమయంలో కేంద్రం జోక్యం'