గుంటూరు జిల్లా తాడికొండ మండలం గరికపాడులో దారుణం జరిగింది. ఆస్తికోసం ఇద్దరు అన్నదమ్ములు.. తండ్రిని చంపారు. గ్రామానికి చెందిన తుమాటి సుబ్బారావుపై ...సెప్టెంబరు 26న పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు, మూడవ కుమారుడు గోవింద్ తలపై కర్రతో దాడి చేశారు. రక్తంతో ఉన్న సుబ్బారావును తన రెండో కుమారుడు ఆదయ్య ఆస్పత్రికి తరలించేందుకు యత్నించాడు.
ఇద్దరు అన్నలు అతడిని అడ్డుకున్నారు. ఆస్తి విషయం తెేలేదాకా ఆసుపత్రికి తీసుకెళ్లనీయబోమని చెప్పడంపై స్థానికులు, బంధువులు కలుగజేసుకున్నారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే అతను మృతి చెందాడు. సుబ్బారావు తన రెండో కుమారుడికి ఎక్కువ ఆస్తి పంచి ఇస్తాడనే అనుమానంతో ఈ హత్య చేశారని పోలీసులు చెప్పారు.
ఇదీ చూడండి: