ETV Bharat / state

డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి

author img

By

Published : Aug 25, 2021, 5:04 PM IST

గుంటూరులోని మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్​రోడ్డలో ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం డివైడర్​ను ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న శాసనమండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి పరిస్థితిని సమీక్షించి... పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

road accident
డివైడర్‌ను ఢీకొన్న బైక్

గుంటూరు నగరానికి సమీపంలోని మహాత్మాగాంధీ ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్​ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మృతులు పెదకూరపాడుకు చెందిన మంచు తిరుపతిరావు(32), గడ్డం కుమారి(40)గా గుర్తించారు.

మృతులు ఇద్దరు పెదకాకాని సమీపంలోని క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారి అమ్మమ్మను చూసి తిరిగి ఇంటికి వెళుతున్నారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డులోకి వచ్చాక ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీ కొట్టడంతో మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే గడ్డం కుమారి మృతి చెందారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న శాసనమండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి పరిస్థితిని సమీక్షించి... పోలీసులకు, అంబులెన్సుకు సమాచారమిచ్చారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి.. మెరుగైన వైద్యం అందిచాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరుపతిరావు మృతి చెందాడు. తిరుపతి రావు మృతి పట్ల ఎమ్మెల్సీ అప్పిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: నాటు తుపాకీతో అన్నను కాల్చి చంపిన తమ్ముడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.