గుంటూరు జిల్లా వినుకొండ మండలం పార్వతీపురంలో ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి గుంటూరుకు.. కూలీలతో వెళ్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. 20మంది గాయపడ్డారు. భీముడు(50), శ్రీనివాస్(7), డ్రైవర్ ఉమేశ్ కుమార్ నాయుడు మృతి చెందారు. ప్రమాద సమయంలో వాహనంలో 30 మంది ఉన్నారు. బాధిత కూలీలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులకు వినుకొండ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా కూలీ పనుల కోసం గుంటూరు వస్తున్నారు.
పరామర్శించిన తెదేపా నేత జీవీ ఆంజనేయులు
వినుకొండ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని.. తెదేపా నేత జీవీ ఆంజనేయులు పరామర్శించారు. ఘటనలో మృతిచెందిన వారికి రూ.15లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్తున్న వ్యవసాయ కూలీల వాహనం ప్రమాదానికి గురికావడం దురదృష్టకరమన్నారు.
ఇదీ చదవండి: పోలవరంలో హైడ్రాలిక్ సిలిండర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభం