పెదకాకాని మండలం అనుమర్లపూడిలో 2 రోజుల క్రితం 400 బస్తాల రేషన్ బియ్యం పట్టుకోగా.. సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మి రెడ్డి తెలిపారు. పీడీఎస్ సరకు అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
తెనాలికి చెందిన అశోక్ అనే వ్యక్తి.. జంపని పెదవడ్లపూడిలో రేషన్ డీలర్ల వద్ద బియ్యం బస్తాలను కొనుగోలు చేశాడు. అనుమర్లపూడిలోని విస్తారం రామకోటయ్య దగ్గర నిల్వ చేశాడు. కోటేశ్వరావు అనే వ్యక్తి సహకారంతో అక్కడ నుంచి తరలించడానికి ప్రయత్నించారు. తూర్పు గోదావరి జిల్లా అలంగుడిలోని విజయలక్ష్మి రైస్ మిల్కు పంపిస్తుండగా అశోక్‌తో పాటు లారీ డ్రైవర్ సన్ షేర్ ఖాన్‌ను అరెస్ట్ చేశామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. రైస్ మిల్లు యజమాని, బ్రోకర్, డీలర్లను అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు.
ఇదీ చదవండి: ఫోన్ కాల్ ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీదేవి.. ఏమన్నారంటే..?