గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో తాజాగా... మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన వ్యక్తి.. అనారోగ్యంతో ఉన్న కారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అతనికి కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్ అని ఫలితం వచ్చింది.
113 తాళ్లూరుకు చెందిన ఓ మహిళ పొలం పనులకు వెళ్లేది. కొద్ది రోజులుగా నలతగా ఉందని ఆసుపత్రికి వెళ్లగా.. ఆమెకు కరోనా పరీక్షలు చేశారు. పాజిటివ్ అని ఫలితం వచ్చినట్టు అధికారులు తెలిపారు. వారి నివాస ప్రాంతాల పరిధిలో 200 మీటర్ల వరకు కంటైన్మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: