ETV Bharat / state

వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్​కు ఫిర్యాదు - tribal women complained to district collector news

జగనన్న చేయూత పథకం జాబితా నుంచి తమ పేర్లు తొలగించారంటూ గుంటూరు జిల్లా వినుకొండ మండలం కొప్పుకొండ తండా గిరిజన మహిళలు కలెక్టర్ వివేక్ యాదవ్​కు ఫిర్యాదు చేశారు. గతేడాది లబ్ధిదారులుగా ఉన్న వారి పేర్లు.. ఈ సంవత్సరం జాబితాలో తీసివేశారని వాపోయారు.

Tribal women
కలెక్టర్​కు ఫిర్యాదు చేసిన గిరిజన మహిళలు
author img

By

Published : Jun 10, 2021, 3:29 PM IST

జగనన్న చేయూత పథకం జాబితాల నుంచి తమ పేర్లు తొలగించి వాలంటీర్లు అన్యాయం చేశారంటూ గుంటూరు జిల్లా కలెక్టర్​ వివేక్ యాదవ్​కు బాధితులు ఫిర్యాదు చేశారు. జగనన్న గృహ నిర్మాణ పథకం శంకుస్థాపన మహోత్సవం కార్యక్రమానికి వచ్చిన జిల్లా పాలనాధికారికి వినుకొండ మండలం కొప్పుకొండ తండా గిరిజన మహిళలు తమ సమస్యను తెలిపారు.

గతేడాది చేయూత పథకం కింద రూ.18,700 తీసుకున్నామని చెప్పారు. ఈ సారి లబ్ధిదారులుగా తమ వివరాలు నమోదు చేసేందుకు వాలంటీర్లు రూ.5000 చెల్లించాలని డిమాండ్​ చేసినట్లు చెప్పారు. వారికి డబ్బులు ఇవ్వకపోవటంతో తమ వివరాలు లబ్ధిదారుల జాబితాలో చేర్చలేదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అన్యాయం చేసిన వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను కోరారు. జగనన్న చేయూత పథకం తమకు వర్తించేయాలని విన్నవించారు. దీనిపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్... బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని తహసీల్దార్​ అనిల్​ కుమార్​కు ఆదేశించారు.

ఇదీ చదవండి: 'ఇసుక డంపింగ్​తో కరకట్ట మనుగడ ప్రశ్నార్ధకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.