ఆహార పదార్థాల్లో కల్తీ.... చాలా చోట్ల కలవరపెడుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో రోజుల తరబడి నిల్వ ఉంచుతున్న ఆహార పదార్థాల వల్ల.... ఆరోగ్యానికీ చేటు కలుగుతోంది. ఈ నేపథ్యంలో.... కల్తీకి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం శిక్షణా తరగతులు చేపడుతోంది. రెండేళ్ల క్రితమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా.... ఇప్పుడు జోరు పెంచింది. చిల్లర దుకాణదారుడి నుంచి పెద్ద హోటళ్ల యజమానులు, ఆహార పదార్థాల విక్రయాలతో సంబంధముండే.... ప్రతి ఒక్కరికీ కల్తీపై అవగాహన కల్పిస్తున్నారు. శిక్షణాననంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైతే ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. అది లేనివారికి లైసెన్సులు క్రమబద్ధీకరించబోమని..... ఆహార కల్తీ నియంత్రణ అధికారులు చెబుతున్నారు.
కనీస అవగాహన లేకపోవడం వల్లే ఆహార కల్తీ జరుగుతోందని.... ఆహారమెలా ఉండాలో, ప్రభుత్వ నియమనిబంధనలు ఏంటో శిక్షణా తరగతుల్లో చెప్తున్నామని నిపుణులంటున్నారు..
ఇదీ చదవండి: