ETV Bharat / state

lokesh: మరో పీఎస్​కు లోకేశ్‌ తరలింపు.. విడుదలపై స్పష్టత ఇవ్వని పోలీసులు - Police did not elaborate on Lokesh's release

Lokesh Shifting to Another PS
లోకేశ్‌ను ప్రత్తిపాడు పీఎస్‌ నుంచి ప్రత్యేక వాహనంలో తిప్పుతున్న పోలీసులు
author img

By

Published : Aug 16, 2021, 6:18 PM IST

Updated : Aug 16, 2021, 8:37 PM IST

18:11 August 16

లోకేశ్‌ను ప్రత్తిపాడు పీఎస్‌ నుంచి ప్రత్యేక వాహనంలో తిప్పుతున్న పోలీసులు

గుంటూరులోని కాకాని రోడ్డులో హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లి అరెస్టయిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. ఎప్పుడు విడుదలవుతారన్న దానిపై స్పష్టత రావడం లేదు. ఇవాళ మధ్యాహ్నం లోకేశ్‌ను అరెస్టు చేసి ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఆయన్ని వెంటనే విడుదల చేయాలంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. 

వేరే వాహనంలో తరలింపు...

ఈ నేపథ్యంలో సాయంత్రం 5.30 తర్వాత వేరే వాహనంలో లోకేశ్‌ను పోలీసులు స్టేషన్‌ నుంచి తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి తన వాహనంలో తిప్పుతున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారన్నది మాత్రం వెల్లడించడం లేదు. లోకేశ్‌పై 151 సీఆర్పీసీ కింద అభియోగాలు నమోదు చేసిన ప్రత్తిపాడు పోలీసులు.. పీఎస్‌ నుంచి లోకేశ్ కాన్వాయ్‌లోనే మరో చోటకు తరలించారు.

   రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేశ్‌ వెళ్లడంతో  గుంటూరులోని పరమయ్యగుంట వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ లబ్ధికోసమే లోకేశ్‌ వచ్చారంటూ వైకాపా శ్రేణులు అక్కడికి చేరుకుని ఆరోపించాయి. ఈ క్రమంలో తెదేపా-వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోటాపోటీ నినాదాలతో శ్రేణులు ఆరోపణలు చేసుకున్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నాలు చేపట్టారు. అనంతరం లోకేశ్‌తో పాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ చేశారు. లోకేశ్‌ను ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మిగతా నేతలను వివిధ ప్రాంతాల్లోని స్టేషన్లకు తీసుకెళ్లారు.

ఇదీ చదవండి.. 

RELEASE: నల్లపాడు పోలీస్‌స్టేషన్ నుంచి విడుదలైన తెదేపా నేతలు

Last Updated : Aug 16, 2021, 8:37 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.