ETV Bharat / state

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 AM

.

TOP NEWS 7 AM
TOP NEWS 7 AM
author img

By

Published : Nov 8, 2022, 6:58 AM IST

  • ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20 ఏళ్ల ఉత్సవాలు.. చంద్రబాబుకు ఆహ్వానం
    ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్ 20 ఏళ్ల ముగింపు ఉత్సవాలకు అతిథిగా తెదేపా అధినేత చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఐస్​బీ ఏర్పాటు జ్ఞాపకాలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మహిళలపై హత్యాయత్నం.. పోలీసులు పట్టించుకోరా..?'
    శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో తల్లీకూతుళ్లపై మట్టి పోసిన ఘటనపై తెదేపా నేత నారా లోకేశ్​ స్పందించారు. వైకాపా నేతలు పట్టపగలు మహిళలను సజీవ సమాధి చేయాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించకపోవడంపై మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ధాన్యం కొనుగోళ్లలో.. మిల్లర్ల పాత్ర పూర్తిగా తొలగించాలి'
    ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర పూర్తిగా తొలగించి రైతులకే పూర్తి ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మద్దతు ధర కన్నా రైతులు తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా వినిపించకూడదన్నారు. రబీకి సిద్ధంగా ఉండాలని వ్యవసాయశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సీఎం గుంటూరు, పల్నాడు పర్యటన.. అధికారులు, నేతల ఏర్పాటు
    ఈ నెల 11వ తేదిన ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి గుంటూరు, పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరులో విద్యా దినోత్సవ వేడుకల్లో, పల్నాడులో స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అయితే ఈ పర్యటన ఏర్పాట్లను ఆయా జిల్లాల పాలనాధికారులు, స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పాములు దరిచేరని అతిపెద్ద గడ్డి కార్పెట్​ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
    వాతావరణంలో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పుణెకు చెందిన ఓ పర్యావరణవేత్త వినూత్నంగా అలోచించాడు. సహజ సిద్ధమైన గడ్డితో దేశంలోనే అతిపెద్ద కార్పెట్​ను​ తయారు చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ట్విస్ట్.. అప్రూవర్​గా మారిన సిసోదియా అనుచరుడు
    దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా ప్రధాన అనుచరుడు దినేశ్ అరోరా అప్రూవర్​​గా మారారు. అయితే ఆయన్ను అప్రూవర్​గా అంగీకరించడంపై ఈ నెల 14న నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కీవ్‌ ముంగిట భయానక శీతాకాలం.. రష్యా దాడులతో నీరు, విద్యుత్తుకు కటకట
    ఉక్రెయిన్​లోని విద్యుత్​ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడానికి.. గత నెలంతా రష్యా ప్రత్యేక దృష్టి పెట్టింది. దాని ఫలితంగా.. కీవ్​ ప్రజలు ఎముకులు కొరికే చలిలోనూ చీకట్లో ఉండిపోయారు. మరి కొద్ది రోజులు ఇలానే దాడులు కొనసాగితే ఉక్రెయిన్​ వాసులకు ఈ శీతాకాలం ఓ పీడకలలా మారనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయింది'.. సచిన్​తో మీటింగ్​పై డివిలియర్స్
    ఒకే ఫ్రేమ్​లో ఇద్దరు బ్యాటింగ్ దిగ్గజాలు కనిపించి అభిమానులకు సర్​ప్రైజ్ ఇచ్చారు. సచిన్ తెందూల్కర్, ఏబీ డివిలియర్స్ కలిసి కాసేపు కాలక్షేపం చేశారు. దీనిపై ఏబీ డివిలియర్స్ ఇన్​స్టాగ్రామ్​లో పోస్టు పెట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నెలన్నరలో 32 లక్షల వివాహాలు.. రూ.లక్షల కోట్ల ఆదాయం
    పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన తరుణంలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) కీలక వివరాలు వెల్లడించింది. కేవలం నెలన్నర వ్యవధిలోనే దేశంలో 32 లక్షల వివాహాలు జరగనున్నాయని తెలిపింది. దీని వల్ల దేశ వాణిజ్య వర్గాలకు భారీ ఎత్తున ఆదాయం చేకూరనుందని అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాధికతో అట్లుంటది మరి అందాన్ని అస్సలు దాచదుగా
    బోల్డ్​ బ్యూటీగా యూత్​లో క్రేజ్​ సంపాదించుకుని అందాల విందు చేస్తున్న ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. కెరీర్​ ప్రారంభం నుంచి గ్లామర్​ ట్రీట్​పై ఆధారపడిన ఈ భామ సోషల్​మీడియాలో నో లిమిట్స్​ అంటూ అందాలను తెగ ఆరబోసేస్తుంది. ఆమె తాజా ఫొటోలను చూసేద్దామా మరి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.