గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని 24వ వార్డులో.. ఇంటిపన్ను రశీదు ఇచ్చేందుకు వెళ్లిన తనను ఓ గృహ యజమాని అసభ్య పదజాలంతో దూషించాడని మహిళా వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను కేవలం రశీదు ఇచ్చేందుకు వచ్చానని, మిగిలిన విషయాలు తనకేమీ తెలిదని చెప్పినా దూషించాడని వాపోయారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి :