ETV Bharat / state

పోలీసులు.. రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారా..? - ap latest hot news

Situation of IPC Act in AP: మనపై ఎవరైనా దాడి చేస్తే.. పోలీసులు ఏం చేస్తారు? IPC చట్టంలోని సెక్షన్ల ప్రకారం బాధ్యులపై కేసుకడతారు! అరెస్ట్ చేసి జైల్లో పెడతారు.! కానీ.. రాష్ట్రంలో ఆలా కాదు..! బాధ్యుల్ని వదిలేసి బాధితులపై రివర్స్‌ కేసులు పెడతారు..! అదెలా అనేగా మీ సందేహం.! అది వైసీపీ పీనల్‌ కోడ్‌.! దాడులు చేసేవారిపై బెయిలబుల్‌ సెక్షన్లు.. ప్రతిఘటించినవారిపై నాన్‌బెయిలబుల్ సెక్షన్లు..! ప్రతిపక్షాలపై పదునెక్కే చట్టం.. అధికార పార్టీ దగ్గరకు వచ్చేసరికి చుట్టంగా.. మారిపోతోంది. పోలీసులు రక్షక భటులా.? వైఎస్సార్సీపీ ప్రైవేటు సైన్యమా అనేంతగా.. ఏపీ పోలీసులు అప్రదిష్ట మూటగట్టుకుంటున్నారు.

police
పోలీసులు
author img

By

Published : Feb 22, 2023, 9:07 AM IST

అధికారంలో ఉన్నవాళ్లకే పోలీసులు కొమ్ముకాస్తున్నారా..?

Police Situation in Andhra Pradesh: అక్టోబరు 20,2021లో..తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైఎస్సార్సీపీ నేతల దాడిపట్ల అప్పటి డీజీపీ గౌతం సవాంగ్‌ స్పందన అదే విధంగా డిసెంబర్‌ 28,2022న.. మాచర్లలో తెలుగుదేశం కార్యాలయం, పార్టీ నేతల ఇళ్లకు వైఎస్సార్సీపీ నాయకులు నిప్పుపెట్టడంపై ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందన చూస్తుంటే.. అధికార పార్టీ వాళ్లది ఏం తప్పులేదు అనే విధంగా ఉంది..

బాధితులపైనే రివర్స్ కేసులు: వీళ్లిద్దరి పోస్టులే కాదు.. పలుకుల్లోనూ ఒక కామన్‌ పాయింట్‌ ఉంది. దాడి చేసిన వారిది తప్పు కాదు.. ప్రేరేపించిన వారిదే తప్పు అనేది వీళ్లద్దరి మాటల్లో అర్థం పరమార్థం. అదేంటి ఐపీసీ సెక్షన్‌లో అలా ఉండదు కదా.. అంటారా? రాష్ట్రంలో అమలౌతోంది ఐపీసీ చట్టమైతే ఫర్వాలేదు.. కానీ ఇక్కడుంది వైసీపీ చట్టం. అది అధికార పార్టీకే చుట్టం.! అధికార పార్టీని ఎవరైనా పల్లెత్తు మాట అంటే చాలు పౌరుషం పుట్టుకొస్తుంది. అంతెందుకు సోషల్‌ మీడియాలో చిన్న పోస్టింగ్‌ పెట్టినా చాలు.. నోటీసులంటూ వెంటాడుతారు. అదే ప్రతిపక్షపార్టీల వారిని.. అధికార పార్టీ నేతలు బండబూతులు తిట్టినా, కర్రలతో చావబాదినా.. మందలుమందలుగా వెళ్లి ఇళ్లు తగలబెట్టినా సరే కళ్లప్పగించి చూస్తారు. పైపెచ్చు బాధ్యులపై కాకుండా బాధితులపైనే రివర్స్ కేసులు బనాయిస్తారు.

ప్రైవేట్‌ సైన్యం: ఎస్సీ, ఎస్టీలను దూషించారనో, పోలీస్‌ విధుల్ని అడ్డుకున్నారనో.. కొత్తకొత్త సెక్షన్లు వెతికి మరీ సంకెళ్లు వేస్తారు. వీలైతే థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగిస్తారు. అధికారపార్టీకి దాసోహమైన.. ఏపీ పోలీస్‌ వ్యవస్థ చట్టాన్ని వైసీపీ చుట్టంగా మార్చేసింది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు ప్రైవేట్‌ సైన్యంలా పనిచేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటవిక రాజ్యాలతరహాలో అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.

ఒక్కొక్కరికీ ఒక్కో ట్రీట్‌మెంట్‌ : అధికార, విపక్షాలు గొడవపడితే ఒక్కొక్కరికీ ఒక్కో ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు మన ఖాకీలు. ప్రతిపక్షపార్టీ వాళ్లపై బెయిల్‌కు వీల్లేని సెక్షన్లు పెట్టేస్తారు. అదే అధికార పార్టీ వాళ్లపై స్టేషన్‌ బెయిల్‌తో బయటకు పంపే సెక్షన్లతో.. సరిపెట్టేస్తారు. కళ్లెదుటే వైఎస్సార్సీపీ శ్రేణులు బరితెగించి దాడులు, విధ్వంసాలు, దహనాలకు తెగబడుతుంటే ఉక్కుపాదంతో అణచేయాల్సింది పోయి.. బాబ్బాబు అంటూ బతిమలాడుకుంటారు. గన్నవరంలో.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులే దీనికి తాజా నిదర్శనం.

అన్నా అన్నా అంటూ: రాము, ఓలుపల్లి రంగా సహా మరికొందరు.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు పోలీసుల్ని నెట్టేసుకుంటూనే టీడీపీ కార్యాలయంపైకి వెళ్లారు. కర్రలతో కార్లు ధ్వంసం చేస్తుంటే, పెట్రోల్‌ పోసి తగలబెడుతుంటే.. అన్నా అన్నా’అంటూ బతిమాలాడేరేగానీ.. అణచివేయలేదు. అక్కడ విధ్వంసం జరిగింది టీడీపీ కార్యాలయంలో, చేసింది ఎమ్మెల్యే అనుచరులన్నది.. స్పష్టమైన వీడియోలున్నాయి. కానీ టీడీపీ నేతలపైనే హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టారు. దాడి చేసిన వైఎస్సార్సీపీ నాయకులపై మాత్రం ఒక కేసు పెట్టేసి.. మమ అనిపించారు.

గతేడాది డిసెంబరులో: గన్నవరమేకాదు.. వైఎస్సార్సీపీ అధికారంలోకొచ్చాక జరిగిన అనేక ఘటనల్లోనూ పోలీసులు రివర్స్‌ కేసులు తప్ప.. రాజ్యాంగం ప్రకారం నడుచుకున్న సందర్భాలు లేవనేచెప్పాలి. గతేడాది డిసెంబరు 25న.. గుడివాడ టీడీపీ కార్యాలయంపైకి కత్తులు, కర్రలతో వెళ్లి పెట్రోల్‌ ప్యాకెట్లు విసిరిన.. వైసీపీ నాయకుడు కాళిపై బెయిలబుల్‌ సెక్షన్ల పెట్టారు. వాళ్లదాడిని.. ప్రతిఘటించే ప్రయత్నం చేసిన రావిపై మాత్రం.. కఠిన సెక్షన్లు నమోదు చేశారు. ఎవరో విసిరిన కర్ర తగిలి.. ఓ హెడ్‌ కానిస్టేబుల్‌కు గాయమైతే.. దానికి టీడీపీ నాయకులే కారణమంటూ కేసు పెట్టారు.

కుప్పంలోనూ: గతేడాది ఆగస్టులో చంద్రబాబు కుప్పం పర్యటనలోనూ ఇదే తంతు. వైసీపీ శ్రేణులు దాడి చేస్తే..65 మంది టీడీపీ కార్యకర్తలపై.. హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. ముగ్గురు.. వైసీపీ నాయకులపై బెయిలబుల్‌ సెక్షన్లు పెట్టినా ఇంతవరకూ అరెస్టు ఊసేలేదు.

మాచర్ల ఘటన: ఇక గతేడాది మాచర్ల టీడీపీ కార్యాలయ దహనం ఘటనల్లో.. పోలీసులు అధికారపార్టీకి పూర్తిగా దాసోహమన్నారు. టీడీపీ నేతల ఇళ్లల్లోకి చొరబడి మారణాయుధాలతో విధ్వంసం సృష్టించిన వైఎస్సార్సీపీ నేతలను వదిలేసి.. టీడీపీ నేత బ్రహ్మారెడ్డి సహా 24 మందిపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు పెట్టారు. టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం వైఎస్సార్సీపీ నాయకులపై బెయిల్‌కు వీలైన సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

చంద్రబాబు ఇంటిపై దాడి: ఇక ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై.. దాడి ఘటనలో పోలీస్‌ చర్యలు.. చట్టాన్ని అపహాస్యం చేశాయనే చెప్పాలి. విపక్షాలుగానీ, ప్రజాసంఘాలుకానీ ప్రజాస్వామ్య యుతంగా నిరసన చేస్తామంటే.. ముందురోజే గృహనిర్బంధం చేసే పోలీసులు.. ఆ రోజు చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తానని ముందే ప్రకటించి మరీ వచ్చిన జోగి రమేశ్‌ను.. ఏమాత్రం నిలువరించలేదు. చంద్రబాబు ఇంటిపైకి మందను వెంటేసుకెళ్లి ఉద్రిక్తతకు కారకుడైన జోగి రమేష్‌పై తేలికపాటి సెక్షన్లు పెట్టిన పోలీసులు.. జోగి రమేష్‌ డ్రైవర్‌ను కొట్టారంటూ టీడీపీ నాయకులపైనే రివర్స్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం పెట్టారు.

కనిపించని నాలుగో సింహం: ఇక తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులోనైతే.. ఏపీ పోలీస్‌ వ్యవస్థకు వెన్నెముక లేదని.. చాటింది. డీజీపీ కార్యాలయ మార్గంలోనే ఉన్న టీడీపీ కార్యాలయంపైకి అంతమంది పెద్దపెద్ద దుడ్డుకర్రలతో మూకుమ్మడిగా దాడి చేస్తే.. కనిపించని నాలుగోసింహం అని చెప్పుకునే పోలీసులు.. ఆ దరిదాపుల్లో కనిపించలేదు. విధ్వంసకారులు దర్జాగా.. డీజీపీ కార్యాలయం మీదుగానే వెళ్లినా అడ్డుకోలేదు. ఇప్పటిదాకా ఒక్క బాధ్యుడిపైనా.. చర్యలు తీసుకోలేదు.

అప్పుడు ఒక్క పోలీసూ రాలేదు: వైఎస్సార్సీపీ నాయకులైతే చోద్యం చేస్తాం.. ప్రతిపక్ష నేతలైతే చితక్కొడతాం అనేలా వ్యవస్థ దిగజారిపోయింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ ఇంటిపై.. దాదాపు మూడు గంటలపాటు దాడి చేసి, విధ్వంసానికి తెగబడ్డారు. స్థానిక పోలీసులు మొదలుకుని ఎస్పీ, డీఐజీ వరకూ ప్రతి ఒక్కరికీ సమాచారమిచ్చినా.. ఒక్క పోలీసైనా రాలేదని రామచంద్రయాదవ్‌ వాపోయారంటే..పరిస్థితి అర్థంచేసుకోవచ్చు.

అమరావతి రైతులపై: పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై.. వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్‌ నేతృత్వంలో వైసీపీ శ్రేణులు రాళ్లు, డీజిల్‌ ప్యాకెట్లు, నీళ్ల ప్యాకెట్లు.. జెండా కర్రలు విసిరితే పోలీసులు చోద్యం చూశారే తప్ప నిలువరించలేదు. కవ్విస్తే కొరడా తీస్తామని హెచ్చరించాల్సిన పోలీస్‌ బాస్‌.. అమరావతి రైతుల్ని అడ్డుకోకుండా మీ నిరసనలు మీరు చేసుకోండని వ్యాఖ్యానించడం.. విధ్వంసకారులకు అలుసైపోయింది.

ఇక మాజీ పోలీస్‌ బాస్‌ గౌతం సవాంగ్‌ అయితే 2019 నవంబరు 28న అమరావతి ప్రాంతంలో చంద్రబాబు బస్సుపై రాళ్లు రువ్వితే.. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందంటూ.. ముక్తాయించారు. అధికార పార్టీ అరాచకాల్ని డీజీపీ స్థాయిలో ఇలా వెనకేసుకొస్తుంటే.. కింది స్థాయి సిబ్బందైన డీఐజీలు, సీఐలు, ఎస్సైలు, ఎవరి స్థాయిలో వాళ్లు.. కొమ్ముకాస్తున్నారనే విమర్శలువస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.