ETV Bharat / state

sexual assault: గురువు అసభ్య ప్రవర్తన.. అశ్లీల చిత్రాలు చూపిస్తూ...! - guntur district updates'

విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారి.. విద్యార్థినులను వేధింపులకు గురిచేశాడు. అశ్లీల చిత్రాలు చూపిస్తూ లైంగికదాడి చేస్తున్నారని విద్యార్థినులు తల్లిదండ్రుల వద్ద వాపోయారు. సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

author img

By

Published : Oct 24, 2021, 10:05 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడి ప్రవర్తనను నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. హుస్సేన్ అనే ఉపాధ్యాయుడు కొంతకాలంగా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని.. అశ్లీల చిత్రాలు చూపిస్తూ లైంగికదాడి చేస్తున్నారని విద్యార్థినులు.. తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆగ్రహానికి లోనైన తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుడు హుసేన్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు తల్లిదండ్రులను పోలీసు స్టేషన్ వద్దకు పిలిపించి మాట్లాడారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని ఆందోళనకారులకు తెలిపారు. పోలీసులు నచ్చచెబుతున్నా వినకుండా బాధితులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయుడిని తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి

SUICIDE: మహిళా ఇంజినీర్​ బలవన్మరణం...అసలేమైంది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.