ETV Bharat / state

ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గాయి: ఎస్పీ అమ్మిరెడ్డి

author img

By

Published : Dec 28, 2020, 7:14 PM IST

గుంటూరు జిల్లా అర్బన్ పరిధిలో.. ఈ ఏడాది నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించామని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. సంవత్సరాంతపు నేరాల నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ ఏడాది కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా కేసులు నమోదయ్యాయని.. ఇతర నేర సంఘటనలు తక్కువగానే ఉన్నాయని తెలిపారు.

The number of crimes has been significantly reduced this year says guntur urban SP Ammereddy
ఈ ఏడాది నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించాం: ఎస్పీ అమ్మెరెడ్డి

గుంటూరు అర్బన్ పరిధిలో ఈ ఏడాది నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించామని.. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. సంవత్సరాంతపు నేరాల నివేదికను విడుదల చేసిన ఆయన.. ఈ ఏడాది కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా నమోదయ్యాయని ఇతర నేర సంఘటనలు తక్కువగానే ఉన్నాయని అన్నారు. మహిళలపై వేధింపుల కేసులు కూడా.. గత సంవత్సరంలో 813 నమోదు కాగా.. ఈ ఏడాది 530 కేసులు నమోదైనట్లు తెలిపారు. గుట్కా, గంజాయి విక్రయాలను అణచివేశామన్నారు. అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహించడం వల్ల రోడ్డు ప్రమాదాలను తగ్గించామని ఎస్పీ వివరించారు.

ప్రజల రక్షణ కోసం కొత్తగా ఏర్పాటు చేసిన విజుబుల్ పోలీసింగ్​ సత్ఫలితాలు ఇచ్చిందని.. పెద్ద ఎత్తున మద్యం, ఇసుక రవాణాను నియంత్రించగలిగామని ఎస్పీ వివరించారు. కొత్త ఏడాదిలో కూడా నేరాలను నియంత్రించేందుకు పోలీసు శాఖ కార్యాచరణ రూపొందించిందని తెలిపారు.

ఇదీ చదవండి:

రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలం: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.