పెళ్లి కుమారుడు కనిపించకపోవటంతో పెళ్లి ఆగిపోయింది. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం బండారుపల్లెలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన శివకృష్ణకు అదే మండలానికి చెందిన ఓ యువతితో బుధవారం రాత్రి వివాహం జరగాల్సి ఉంది. అయితే కూరగాయల కోసం ఉదయాన్నే ఏర్పేడుకు వెళిన పెళ్లి కుమారుడు తిరిగి రాకపోవడం వల్ల పెళ్లి అర్థాంతరంగా ఆగింది. దీంతో ఆచూకీ తెలియజేయాలని వరుడు బంధువులు ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండీ...రాజధాని కోసం భూములిచ్చాం.. మమ్మల్ని మోసం చేయవద్దు: రైతులు