గుంటూరు జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల గ్రామాలపై స్పష్టత వచ్చింది. తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో మొదటి విడత ఎన్నికలు నిర్వహిస్తుండగా.. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 337 పంచాయతీల్లో 67 ఏకగ్రీవమయ్యాయి. ఈ కారణంగా 270 పంచాయతీల్లో మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. 688 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వార్డుల పరంగా తొలివిడతలో 2వేల 105 వార్డుల్లో.. ఈనెల 9వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అందులో 4వేల 174మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
తొలివిడత ఏకగ్రీవాల్లో మూడు పంచాయతీల్లో మినహా.. అన్నిచోట్ల వైకాపా మద్దతుదారులు ఎన్నికయ్యారు. అత్యధికంగా రేపల్లె నియోజకవర్గంలో 17పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. బాపట్ల 15, వేమూరు 12, పొన్నూరు 10, తెనాలి 7, ప్రత్తిపాడు 6 పంచాయతీల ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. వార్డు సభ్యుల ఏకగ్రీవాల్లో కూడా అత్యధికంగా అధికార పార్టీ వారే ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండీ.. 6,400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌కు... రివర్స్ టెండరింగ్!