ETV Bharat / state

నిధులు లేక ఆగిన పనులు... అవస్థలు పడుతున్న ప్రజలు

తాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలకు...కేెంద్ర ప్రభుత్వం ప్రవేశపేట్టిన అమృత్ పథకం కింద ట్యాంకుల నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. దీంతో తమ కష్టాలన్నీ తీరిపోతాయనుకున్నారు. గుక్కెడు మంచినీళ్లకు కి.మీ వెళ్లాల్సిన అవసరం లేదనుకున్నారు. అయితే వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. నిధుల కొరతతో ప్రాజెక్టు పనులు మధ్యలోనే ఆగిపోయాయి.

author img

By

Published : Jan 9, 2021, 6:46 PM IST

Scheme
అమృత్ పథకం

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అమృత్ పథకం కింద నిర్మిస్తున్న మెగా తాగునీటి పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. నిధుల కొరతతో పనులు ముందుకు కదలడం లేదు. ఆర్థిక ఇబ్బందులతో పురపాలకసంఘం వాటా నిధులు విడుదల కాక పనులు నిలిచిపోయాయి. దీంతో తాగునీరు కోసం పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రవేశపేట్టిన అమృత్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 5 నగరాలు, 26 పురపాలక సంఘాలు ఎంపికయ్యాయి. గుంటూరు జిల్లాలో నరసరావుపేట, తెనాలితోపాటు చిలకలూరుపేట పురపాలకసంఘానికి అమృత్ పథకాన్ని వర్తింపజేశారు. 24 గంటలు నిరంతర తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో చేపట్టిన నిర్మాణ పనులు 2017 నుంచి చిలకలూరిపేటలో ప్రారంభమయ్యాయి. ఈ మున్సిపాలిటి పరిధిలో 27 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. అందులో 15 వేల కుటుంబాలకు తాగునీరు కుళాయిలుండగా... మరో 12 వేల మందికి అమృత పథకం ద్వారా కుళాయిలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం పట్టణంలో రోజు మార్చి రోజు నీటిని విడుదల చేస్తున్నారు. అరకొరగా వచ్చే నీళ్లు సరిపోక ప్రజలు కష్టాలు పడుతున్నారు.

నిధులు లేక...

ఈ తాగునీటి ప్రాజెక్టును రూ. 139.80 కోట్లు వ్యయంతో నిర్మించడానికి పనులు ప్రారంభించారు. అందులో రూ.32.39 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలిన రూ. 107.41కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఈ పథకానికి కేంద్రం నుంచి రావల్సిన రూ.40.9 కోట్లలో రూ.12.84 కోట్లు మాత్రమే విడుదల చేసింది. రాష్ట్ర సర్కార్ వాటా కింద రూ.16.13 కోట్లు ఇవ్వాల్సి ఉండగా... ఇంతవరకు రూ. 4.6 కోట్లు వచ్చాయి. పురపాలక సంఘం తన వాటాగా రూ. 82.76 కోట్లు వెచ్చించాల్సి ఉండగా..... ఇప్పటివరకు రూ.14.94 కోట్లు ఖర్చుచేసింది. మిగిలిన రూ. 67.82 కోట్లు మున్సిపాలిటి నుంచి రావాల్సి ఉంది. ఈ వాటా ఇస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాలను విడుదల చేసే అవకాశముంది. ఈ తాగునీటి పథకం పూర్తి అయితేనైనా... దాహార్తి తీరుతుందని పట్టణ ప్రజలు ఆశతో ఉన్నారు. ఇది జరగకపోవడంతో వారు గుక్కెడు నీరు తాగడానికి కూడా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పట్టణ శివారులోని వైఎస్సార్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, డైక్ మాన్ నగర్, మద్దినగర్ వంటి ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఏర్పడుతోంది. ఈ ప్రాంతాల్లో రెండు రోజులకొకసారి కుళాయిలు ద్వారా తాగునీరు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టులో భాగంగా పట్టణంలో 3 ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి ప్రతిపాదించారు. వాటిలో శ్రీనివాసనగర్, తూర్పు మాలపల్లి వద్ద రెండు పూర్తయ్యాయి. టిడ్కో గృహ సముదాయం వద్ద మూడో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు అంతర్గత పైపులైను నిర్మాణం చేపట్టాం. అందులో మొదటి దశలో 15 కిలోమీటర్ల పైపులైను పనులు పూర్తి అయ్యాయి. రెండో దశలో 45 కిలోమీటర్లకు... 10 కిలోమీటర్ల మేర పూర్తి కావాల్సి ఉంది. నిధుల కొరతతో ఆగిపోయిన పనుల విషయంపై మంత్రులతో చర్చించాం. సానుకూలంగా స్పందించిన వారు... రావల్సిన బకాయిలు విడుదల చేస్తామన్నారు. అవి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. -రవీంద్ర, చిలకలూరిపేట పురపాలక కమిషనర్

ప్రస్తుతం కోటప్పకొండ వరకు సాగర్ కాల్వ ద్వారా నీళ్లొస్తుండగా... అక్కడ నుంచి ఆప్టేక్ చాంబర్ ఏర్పాటుతో పైపులైను ద్వారా పట్టణంలోని రెండు తాగునీటి చెరువులను నింపుతున్నారు. సాగర్ కాల్వ టెయిల్ ఎండ్ ప్రాంతం కావడంతో తాగునీరు సక్రమంగా అందడం లేదు. దీంతో కొత్త ప్రాజెక్టులో భాగంగా నకరికల్లు అడ్డరోడ్డు నుంచి సాగర్ కాల్వ ద్వారా చిలకలూరిపేటలోని తాగునీటి చెరువుల అనుసంధానానికి 40.85 కిలోమీటర్ల పైపులైను వేయాలనేది లక్ష్యం. అయితే ఇప్పటివరకు 11 కిలోమీటర్లు మేర మాత్రమే పైపులైను పూర్తయింది. - శ్రీనివాస్, డీఈ, ప్రజారోగ్య సాంకేతిక శాఖ

మనిషి జీవించడానికి ఎంతో అవసరమైన... ఇరిగేషన్​ ప్రాజెక్టు పనులు అలసత్వం వహించడం ప్రస్తుత పాలకుల పరిపాలనకు అద్దం పడుతోంది. ఇంటింటికి కుళాయి కనెక్షన్ లు ఉన్నా వాటిలో నీరు రావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు తప్ప... కొత్తగా ఎటువంటి అభివృద్ది జరగలేదు. దయచేసి ఇకనైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం. -స్థానికులు

నిర్మాణానికి ఎదురవుతున్న నిధుల కొరతపై రాష్ట్రప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని చిలకలూరిపేట ప్రజలు కోరుతున్నారు. పురపాలక సంఘానికి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్రప్రభుత్వమే ఈ మొత్తాన్నిభరించాలని అధికారులు పేర్కొంటున్నారు. నిధులు విడుదల అయితేనే ప్రజలకు సురక్షితమైన, శుద్ధి నీరు అందించడం సాధ్యమవుతుంది.

ఇదీ చదవండి: భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లు.. కనిపించని కరోనా ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.