అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళన 591వ రోజుకు చేరింది. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, పెదపరిమి, బోరుపాలెం, నెక్కల్లు, వెంకటపాలెం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. జై అమరావతి అంటూ నినదించారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద గాయత్రి మహామంత్రం, భగవద్గీత పారాయణం పఠించారు సకల దేవతల చల్లనిచూపు, కరుణా కటాక్షాలు రాజధాని అమరావతిపై ఉండాలని కోరుకున్నారు. అమరావతిలో మట్టి, ఇసుక, కంకర తీసుకెళ్లిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు కిందిస్థాయి వ్యక్తులను కాకుండా అసలైన దొంగలను పట్టుకోవాలని రైతులు, మహిళలు కోరారు. పోలీసుల చర్యలు తూతూ మంత్రంలా ఉన్నాయని ఆరోపించారు.
ఇదీ చదవండీ.. విశాఖ మన్యంలో లాటరైట్ తవ్వకాలపై విచారణ కమిటీ ఏర్పాటు