గుంటూరు జిల్లా మంగళగిరిలో 90 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించాడు. పట్టణంలోని 30వ వార్డు పార్క్ రోడ్డు 9వ లైనుకు చెందిన బత్తుల వెంకటేశ్వరరావుకు కరోనా సోకింది. వృద్దాప్యంలో కరోనా సోకటంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. కొవిడ్19 ఇన్సిడెంట్ కమాండర్ మంగళగిరి తహసీల్దార్ జీవీ రామ్ ప్రసాద్ దృష్టికి తీసుకు వెళ్లారు. వెంటనే ఆయన స్పందించి.. ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. వెంకటేశ్వరరావుకు పడకను కేటాయించారు.
వైద్యుల సలహాలు పాటిస్తే కొవిడ్‌ను సులువుగా జయించొచ్చు..
ఈ నెల 18న ఎయిమ్స్‌లో చేరిన వెంకటేశ్వరరావు.. కేవలం అయిదు రోజుల చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో కొవిడ్‌ను జయించి ఇంటికి చేరుకున్నారు. వైద్యులు సూచించిన ప్రకారం సమయానికి మందులు, ఆహారం తీసుకున్నానని చెప్పారు. వైరస్ సోకినా భయపడకుండా వైద్యుల సలహాలు పాటిస్తే కొవిడ్‌ను సులువుగా ఎదుర్కొనవచ్చని తెలిపారు. తనకు బెడ్ కేటాయించిన తహసీల్దార్ రామ్ ప్రసాద్ కు, వైద్యులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చూడండి: