గుంటూరు జిల్లా సుద్దపల్లి డొంక శ్రీలక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్మించాల్సిన వైయస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మరో ప్రాంతంలో నిర్మిస్తామని నగర మేయర్ హామీ ఇచ్చారని తాళ్లాయపాలెం పీఠాధిపతి శివస్వామి చెప్పారు. ఈ సందర్బంగా ఆయనకు స్వామి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విజయవాడలో ఎన్నో పురాతన దేవాలయాలు పడగొట్టినపుడు పీఠాధిపతులు అందరం కలిసి నిరసనలు తెలిపినా… రాజకీయ నాయకులను కలిసినా.. ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం హిందూ మతం పట్ల ప్రత్యేక గౌరవాన్ని కలిగి ఉన్నారని.. ఎటువంటి సమస్య వచ్చినా మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకవెళ్లిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
ప్రతి 30 వేల జనాభాకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని మేయర్ అన్నారు. ఈ మేరకు గుంటూరు నగరంలో 17 ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 15 ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన కూడా నిర్వహించామని పేర్కొన్నారు. ఈ క్రమంలో సుద్దపల్లి డొంక శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో వైయస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారుల ద్వారా నిర్ణయించామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి , శివస్వామి సూచనలకు అనుగుణంగా ఆలయ ప్రాంగణంలో నిర్మించతలపెట్టిన, ఆరోగ్య కేంద్రాన్ని మరో ప్రాంతంలో నిర్మిస్తున్నామని మేయర్ తెలిపారు.
ఇదీ చూడండి: