ETV Bharat / state

రేపల్లెలో నీటి కోసం స్థానికుల రాస్తారోకో - tenali

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో స్థానికులు ధర్నా చేపట్టారు. వారం రోజులుగా నీరురావడంలేదని డ్రమ్ములతో నిరసనకు దిగారు.

రేపల్లెలో నీటి కోసం స్థానికుల రాస్తారోకో
author img

By

Published : Jun 18, 2019, 12:50 PM IST

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. గత వారంరోజులుగా తాగు నీటి సమస్య వెంటాడుతున్నందున పేటేరు-రేపల్లె ప్రధాన రహదారి పై డ్రమ్ములను అడ్డంగా ఉంచి నిరసన తెలిపారు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన తమ గోడు వినిపించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రేపల్లె పురపాలక కమీషనర్ అంజయ్య అక్కడికి చేరుకుని వారి సమస్యలు విన్నారు. . నీటి సమస్య లేకుండా చర్యలు చేపడతామని చెప్పి... వెంటనే ట్యాంకర్లలో నీరు తెప్పించారు.దీంతో పట్టణవాసులు రాస్తారోకో విరమించారు.

ఇదీ చదవండి

ఓటమిపై తెదేపా ఆత్మపరిశీలన చేసుకోవాలి: మంత్రి అవంతి

Intro:Ap_cdp_46_14_peddasupatri_taguneetiki_katakata_pkg_c7
కడప జిల్లా రాజంపేట లోని వైద్యవిధాన పరిషత్ వైద్య కేంద్రం ఇది. డివిజన్లోనే పెద్ద ఆసుపత్రి. చుట్టుపక్కల మండలాల నుంచి నిత్యం వందలాది మంది రోగులు వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడే సీమాంక్ కేంద్రం ఉంది. కాన్పు కోసం వచ్చే గర్భిణీలు, పసిపిల్లలకు టీకాలు వేయించడానికి వచ్చే తల్లులు వివిధ ప్రమాదాల్లో గాయపడి ఆసుపత్రిలో చేరే క్షతగాత్రులు ఇలా ఎంతోమంది నిత్యం ప్రతి గా ఉండే ఆసుపత్రి ఇది ఇలాంటి ఇ ఆసుపత్రిలో గుక్కెడు తాగునీటి కోసం రోగులు, రోగుల బంధువులు పరుగులు తీయాల్సిన దృష్టి నెలకొంది. చూడడానికి సీమాంక్, ట్రామా కేర్, సామాజిక ఆరోగ్య కేంద్రం కోసం మూడు భవనాలు ఉన్నాయి. కానీ మాత్ర మింగుదామన్న మంచినీరు దొరకదు. గ్లాసుడు నీటికోసం బయటికి వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది.
* రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకు 600 మంది రోగులు వస్తుంటారు. వీరి కోసం 2 కుళాయిలు ఏర్పాటు చేసి ఫిల్టర్ పెట్టారు. ఇది గత నాలుగు రోజులుగా పని చేయడం లేదు. సీమాంక్ కేంద్రంలో కూలర్ ఉండేది. ఇది చెడిపోయి మూలకు చేరింది. మండుటెండలో సాధారణ వ్యక్తులే అల్లాడుతుంటే ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగులు ఇంకెంత ఇబ్బంది పడతారు అధికారులు అర్థం చేసుకోవడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేదు. ఇటీవల ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశమై రోగులకు ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఇలా చెప్పిన రెండు రోజులకే తాగునీటి సమస్య వచ్చింది. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఎవరికైనా నీరు అవసరమైతే సీసా నీటిని ఐదు రూపాయలు, 10 రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఆసుపత్రి సూపరిండెంట్ సాదిక్ స్పందిస్తూ త్వరగా మరమ్మతులు చేయించి తాగునీటి సమస్య లేకుండా చేస్తామని తెలిపారు.

Body:దవాఖానలో దాహం కేకలు

Conclusion:కడప జిల్లా రాజంపేట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.