ETV Bharat / state

జాతీయస్థాయి హ్యాండ్​బాల్ పోటీలకు తెనాలి విద్యార్థిని ఎంపిక - tenali latest news

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివనాగజ్యోతి రాష్ట్రస్థాయి హ్యాండ్​ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. లఖ్​నవూలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది.

Tenali student selected for national level handball competitions
జాతీయస్థాయి హ్యాండ్​బాల్ పోటీలకు తెనాలి విద్యార్థిని ఎంపిక
author img

By

Published : Mar 29, 2021, 10:14 PM IST

జాతీయస్థాయి హ్యాండ్​బాల్ జూనియర్ మహిళల విభాగం పోటీలకు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన విద్యార్థిని ఎమ్.శివనాగజ్యోతి ఎంపికైంది. ఏప్రిల్ 2 నుంచి లఖ్​నవూలో జరగనున్న జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొననుంది. శని, ఆదివారాల్లో ప్రకాశం జిల్లా కందుకూరు టీఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో జరిగిన జూనియర్ హ్యాండ్​బాల్ మహిళా విభాగంలో రాష్ట్రస్థాయిలో గెలుపొందడంతో ఆమె జాతీయస్థాయికి ఎంపికైంది.

తమ కళాశాల తరఫున ఉత్తమ ప్రతిభ కనబరిచిన శివనాగజ్యోతిని కళాశాల ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అభినందించారు. జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి.

కరోనా జాగ్రత్తలపై పోలీసుల అవగాహన కార్యక్రమాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.