రైతుల పై తప్పుడు కేసులు బనాయిస్తే పోలీసులపై న్యాయపోరాటం చేస్తామని ... తెదేపా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ తేల్చి చెప్పారు. అమరావతిని పరిపాలనా రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో రైతులు చేస్తున్న ఉద్యమం 360వ రోజుకు చేరుకున్న సందర్భంగా మందడం దీక్షశిబిరం వద్ద ... బుద్ధుడి విగ్రహాన్ని తెనాలి శ్రావణ్ కుమార్, విశ్రాంత పోలీస్ అధికారి కాళహస్తి సత్యనారాయణ ప్రారంభించారు. బుద్ధుడు నడయాడిన ప్రాంతంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతుల పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. దీనిని గట్టిగా ఎదుర్కొంటామని వివరించారు.
ఇదీ చదవండీ...