Demand for Tenali district: ప్రపంచవ్యాప్తంగా ఘన చరిత్ర కలిగిన తెనాలిని జిల్లాగా ప్రకటించాలని తెనాలి జిల్లా సాధన కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎంతో నవ నాగరికత, కళలకు పుట్టినిల్లు అయిన తెనాలిని జిల్లాగా గుర్తించకపోవటం అవమానకరమైన విషయమని కమిటీ అభిప్రాయపడింది. ఇక్కడి మాగాణి, మెట్ట భూములు బంగారం పండే భూములతో సమానమైనవని కమిటీ కన్వీనర్ ఈదర వెంకట పూర్ణచంద్ తెలిపారు. వరితోపాటు పలు వాణిజ్య పంటలకు ఈప్రాంతం ప్రసిద్ధి చెందిందని అన్నారు. ఇక వర్తక వ్యాపారాల విషయానికొస్తే తెనాలిలో ఉత్తమ నాణ్యత కల్గిన టేకు విషయంలో ఉభయ రాష్ట్రాలతో పోల్చితే తెనాలి మొదటి స్థానంలో ఉందని అన్నారు. పలు జిల్లాల నుండి ఇక్కడికి వచ్చి బంగారం కొనుగోలు చేస్తుంటారని తెలిపారు. పారిశ్రామికంగా ఎంతో ప్రసిద్ధికెక్కిన కుమార్ పంపుసెట్లు, డబుల్ హార్స్ మినపగుళ్ల తయారీ వంటివి తెనాలి సొంతమని అన్నారు.
కళలకు ప్రసిద్ధి తెనాలి..
కళల విషయానికొస్తే కళల కాణాచిగా తెనాలి ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందిందని కమిటీ సభ్యులు అన్నారు. సినీ ఆర్టిస్టుల్ని ఎంతో మందిని తెనాలి ప్రాంతం అందించిందని గర్వంగా చెప్పవచ్చని తెలిపారు. కానీ కొత్తజిల్లాల ఏర్పాటు విషయంలో తెనాలిని గుర్తించిక పోవడం తమ ప్రాంతాన్ని వైకాపా ప్రభుత్వం అవమానించడమేని అన్నారు. ఇప్పటికైనా తెనాలిని జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'గాంధీ అహింస ఆయుధానికి.. నిరంకుశత్వం తలవంచింది'