తెలంగాణ నుంచి అనుమతి తీసుకొని వచ్చిన ప్రజలను నిబంధనల పేరుతో రాష్ట్ర సరిహద్దులో ఆపేసిన ప్రభుత్వం.. వైకాపా నేతలకు ఎందుకు వర్తింపజేయడం లేదని తెదేపా నేత అచ్చెన్నాయుడు నిలదీశారు. గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి కనీస ఏర్పాట్లు చెయ్యకుండా గంటల తరబడి గర్భిణులను, విద్యార్థులను రోడ్లపై కూర్చోబెట్టారని దుయ్యబట్టారు. క్వారంటైన్‌కి వెళితే కానీ రాష్ట్రంలోకి అనుమతించబోమని ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. ప్రతిపక్ష నేత రాష్ట్రానికి వచ్చినా క్వారంటైన్ కి వెళ్లి రావాల్సిందే అని వైకాపా మంత్రి మోపిదేవి చెప్పిన విషయాన్ని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. హైదరాబాద్‌కు వెళ్లిన మంత్రి సురేశ్‌ను క్వారంటైన్‌కు పంపిస్తారా? అని ప్రశ్నించారు.
ఇవీ చూడండి...