ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పసుపును ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో పసుపు సాగును పరిశీలించారు. ఈసందర్భంగా.. పంట సాగులో ఎదురవుతున్న సమస్యలను రైతులు వివరించారు.
పసుపు పంట దిగుబడి తగ్గటం, ధరలు పడిపోవటంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వమే రైతును ఆదుకోవాలని.. పసుపు పంటను రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీచూడండి: