అసత్య హామీలతో అధికారం చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. మూడేళ్లుగా రాష్ట్రాన్ని రివర్స్‌లో తీసుకెళ్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఓ కార్టూన్ విడుదల చేసింది. రాష్ట్రానికి మద్యం, మటన్, చేపల దుకాణాలు తీసుకురావడం తప్ప సాధించిందేమీ లేదంటూ వీడియోలో వివరించింది.
ప్రజావేదిక, దేవాలయాల విధ్వంసానికి పాల్పడ్డారని దుయ్యబట్టింది. ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలో నిరుద్యోగిత 26శాతానికి చేరగా, సేవారంగం 7శాతానికి పడిపోయిందని పేర్కొంది. రూ. 7లక్షల కోట్లు అప్పులుచేయడంతో ప్రతి ఒక్కరిపై.. లక్షన్నర రూపాయల భారం పడుతోందని వివరించింది.
ఇదీ చదవండి: CBN Meeting : నేడు కందుకూరు తెదేపా నేతలతో చంద్రబాబు సమావేశం