గుంటూరు గ్రామీణ పోలీసులు పెద్దఎత్తున తెలంగాణ మద్యాన్ని పట్టుకున్నారు. అచ్చంపేట మండలం గింజుపల్లి వద్ద 4,236 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పడవలో తెలంగాణ మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. సత్తెనపల్లిలో ఆటోలో తరలిస్తున్న 743 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని వెల్లడించారు.
అక్రమ ఇసుక, మద్యం రవాణాపై నిరంతర నిఘా ఉంటుందని.. అక్రమ రవాణాపై ప్రజలు సమాచారం అందించాలని గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని పిలుపునిచ్చారు. మద్యం అక్రమ రవాణాకు సంభందించి పులువురిని అరెస్టు చేశామని.. తెలంగాణలో సరకు విక్రయిస్తున్న మద్యం దుకాణదారులపైన కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి పేకాట శిబిరం వ్యవహారంతో నాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే శ్రీదేవి