ETV Bharat / state

ఉపాధ్యాయ ఓటర్లు @ 8,603 - krishna districts news

కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించారు. జాబితాను ఓటర్ల పరిశీలన కోసం కలెక్టరేట్లు, సబ్‌ కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దారు కార్యాలయాల్లో ప్రదర్శనలో ఉంచారు.

Teacher voters 8,603 at guntur, krishna districts
ఉపాధ్యాయ ఓటర్లు @8,603
author img

By

Published : Dec 3, 2020, 7:51 AM IST

కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించారు. జాబితాను ఓటర్ల పరిశీలన కోసం కలెక్టరేట్లు, సబ్‌ కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దారు కార్యాలయాల్లో ప్రదర్శనలో ఉంచారు. ఈ ఏడాది అక్టోబరు 1న ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. నవంబరు ఆరో తేదీ వరకు ఓటరుగా నమోదుకు దరఖాస్తులను అధికారులు రెండు జిల్లాల్లోనూ స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి ముసాయిదా ఓటర్ల జాబితాను డిసెంబర్‌ ఒకటో తేదీన ప్రకటించారు.

గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మొత్తం 13, 107 మంది ఉపాధ్యాయులు ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. 8,603 దరఖాస్తులు పరిశీలనలో అర్హులుగా ప్రకటించారు. 4,504 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. దరఖాస్తు చేసుకున్న వాటిలో ఎక్కువగా ఓటరుగా నమోదు కోసం అవసమైన పత్రాలను అందించలేదు. సరైన పత్రాలు అందించని వారి దరఖాస్తులను తిరస్కరించారు. రెండు జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాలు మరో మారు ఓటరుగా నమోదుకు అవకాశం కల్పించాలని అధికారులను కోరారు. ఇదిలా ఉండగా బుధవారం రెండు జిల్లాల్లోని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో డీఆర్వో చంద్రశేఖర్‌రెడ్డి సమావేశమై ఓటరుగా నమోదుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.

నెలాఖరు వరకు అవకాశం

కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఓటరుగా నమోదుకు ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్ఛు తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. అవసరమైన పత్రాలను ఖచ్చితంగా జతచేయాల్సి ఉంది. తిరస్కరణకు గురైన వాటిలో ఎక్కువగా సరైన పత్రాలను అందజేయకపోవడం, దరఖాస్తును పూర్తి చేసే క్రమంలో తప్పులున్నాయి. అటువంటి పొరపాట్లు లేకుండా దరఖాస్తు చేసుకుని ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవచ్ఛు - సి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి/డీఆర్వో

దరఖాస్తు ఇలా..

ఉపాధ్యాయ ఓటరుగా నమోదుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్ఛు ఆన్‌లైన్‌లో ceoandhra.nic.in వెబ్‌సైట్‌లో ఫారం-19ను దాఖలు చేసుకోవచ్ఛు ఆఫ్‌లైన్‌లో తహసీల్దారు, ఎంపీడీవో, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తులను పూర్తి చేసి నేరుగా అందించాలి.

ఇదీ చదవండి:

చౌక దుకాణాల్లో కందిపప్పు ధర పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.