గుంటూరు జిల్లా నిజాంపట్నంలోని ముత్తుపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో.. కంచర్ల కోటేశ్వరరావు ఆంగ్ల ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు అతను పిట్టలవానిపాలేనికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం పోలింగ్ బూత్‌కు వెళ్లే క్రమంలో.. అతనికి గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి సిబ్బంది.. బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
ఇదీ చదవండి: విద్యార్థుల చదువులపై ఇంకా వీడని కరోనా ప్రభావం