ప్రశాంతంగా ఉన్న పల్నాడులో..వైకాపా ప్రభుత్వం ఫ్యాక్షన్ రాజకీయలను రెచ్చగొడుతోందని తెలుగుదేశం నేత యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి ప్రోత్సాహంతోనే వరుస హత్యలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పల్నాడులో నలుగురిని అంతమొందించారని.. పదుల సంఖ్యలో తెలుగుదేశం శ్రేణులపై దాడులు జరిగాయని మండిపడ్డారు. ఇటీవల హత్యకు గురైన అంకులు కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయల పరిహారం అందజేయాలని యరపతినేని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: