తెలుగు మహిళల ఉత్సాహం చూస్తుంటే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయంగా కనిపిస్తుందని మాజీ రాజ్యసభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వై.వెంకట్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన తెలుగు మహిళ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా గాలి వీస్తోందని అన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే...విజయాన్నందిస్తాయని అన్నారు. తెదేపా మహిళలు అండగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి