వైకాపా ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తనను సీఐడీ (CID) పోలీసులు అరెస్టు చేశారని తెనాలికి చెందిన తెలుగుదేశం పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్త జ్యోతిశ్రీ ఆరోపించారు. సోషల్ మీడియాలో సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులకు సంబంధించి.. అభ్యంతరకర పోస్టులు పెట్టారనే ఆరోపణపై జ్యోతిశ్రీని అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.. గుంటూరులోని సీబీసీఐడీ (CBCID) కోర్టులో ఆమెను హాజరుపరిచారు.
ఆమెకు జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయడంతో జ్యోతిశ్రీ విడుదలయ్యారు. తన అరెస్టు కేవలం రాజకీయ కక్షతో చేసినదేనని ఆమె అభివర్ణించారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు భయపడబోమని అన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తనను ఇంటి నుంచి సీఐడీ కార్యాలయానికి విచారణ పేరుతో తీసుకెళ్లారని ఆరోపించారు. తాను పెట్టిన పోస్టుల్లో ఎలాంటి అసభ్యకర పదజాలం లేదని.. తెదేపా సైనికులుగా తమకు క్రమశిక్షణ ఉందని జ్యోతిశ్రీ చెప్పారు.
ఇదీ చదవండి:
సామాజిక మాధ్యమాల్లో పోస్టులు.. సీఐడీ కోర్టుకు తెదేపా నాయకురాలు జ్యోతిశ్రీ