గుర్తు తెలియని వాహనం ఢీకొని తెదేపా సీనియర్ నాయకులు, రామకృష్ణ ట్రేడర్స్ ప్రొప్రయిటర్ పోకా రామారావు మృతి చెందిన ఘటన.. గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలం వెల్లటూరు కురవ వద్ద జరిగింది. పేర్లపాడు నుంచి వినుకొండకు వెళ్తున్న క్రమంలో.. వెల్లటూరు గ్రామం దాటిన తర్వాత కురవపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన రామారావును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తీసుకు వెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. అనంతరం నరసరావుపేట తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం.
ఇవీ చూడండి..
కరోనాతో మాజీ సైనికుడు మృతి... మృతదేహం తీసుకొస్తూ మరో వ్యక్తి మరణం