పేద ప్రజల కోసం గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని.. మాజీ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఆయన నా ఇల్లు - నా సొంతం కార్యక్రమంలో లబ్ధిదారులు, తెదేపా కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. వరసిద్ధి వినాయక విగ్రహం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి వినుకొండ శివారులోని టిడ్కో గృహ సముదాయాల ముందు ధర్నా నిర్వహించారు.
గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజల కోసం 4 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడితే.. అందులో నిర్మాణం పూర్తైన ఇళ్లను సైతం వైకాపా ప్రభుత్వం లబ్ధిదారులకు అప్పగించడం లేదని మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు ఆరోపించారు. తక్షణం నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని.. పెండింగ్ బిల్లులను చెల్లించాలని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో వందల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసిందని.. సీబీఐ విచారణ జరపాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: