గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో తెలుగుదేశం ఆధ్వర్యంలో చేపట్టిన "నా ఇల్లు నా సొంతం" కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని పట్టణ నేతలు తెలిపారు. ప్రభుత్వం సహా అధికార పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత వస్తోందని పేర్కొన్నారు.
అది దుర్మార్గమైన చర్య..
రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలను కూల్చివేస్తున్న తరుణంలో నివాసాలను లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుండటాన్ని దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఈ మేరకు పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇవీ చూడండి : సీజేఐ పరిధిలో ఉన్నందున సమ్మతి ఇవ్వలేను: ఏజీ కె.కె.వేణుగోపాల్