Why AP does not Needs Jagan: ఇన్ని ఘోరాలు చేసి.. మళ్లీ ఓటు ఎలా అడుగుతావు జగనన్నా..?
అనంతపురం జిల్లా రాయదుర్గంలో చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు వెంటనే విడుదల కావాలని కోరుతూ గుంతకల్లులో మారెమ్మ ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి జిల్లా కదిరిలో దీక్షలకు పకీర్లు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జిల్లా కామనూరులో ర్యాలీగా వెళ్లి కుందూ నదిలో దీక్ష చేపట్టారు. కర్నూలు జిల్లా ఆస్పరిలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. నంద్యాలలో దీక్షా శిబిరాన్ని శాలివాహన సంఘ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. డోన్‌లో టీడీపీ కార్యకర్తలు గుంజీళ్లు తీసి నిరసన వ్యక్తం చేశారు. జనసేన నాయకులు బైక్‌లపై ర్యాలీగా శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. నెల్లూరులో టీడీపీ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు కొనసాగాయి.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో దీక్షల్లో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలు మోకాళ్లపై నిలబడి, అర్ధనగ్నంగా నిరసన తెలియజేయగా.. జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దీక్షా శిబిరాన్ని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం మంటాడలో దీక్షా శిబిరాన్ని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ సందర్శించారు. అవనిగడ్డలో చేపట్టిన దీక్షల్లో భావదేవరపల్లి, సంగమేశ్వరం, కమ్మనమోల గ్రామాల టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. గన్నవరం, పెదప్రోలులో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు.
చంద్రబాబు విడుదల కావాలని కోరుతూ ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆలయాలు, చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం చింతపల్లిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన శ్రేణులు కాగడాల ర్యాలీ చేపట్టాయి. విశాఖలో తెలుగు మహిళలు వైసీపీ నేతల మాస్కులు ధరించి వారు చేసిన అవినీతిని గురించి వివరిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా రాజాంలో దీక్షల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో టీడీపీ నేత కూన రవికుమార్ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగించారు. మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందగా శిబిరంలో వారికి నివాళులర్పించారు.