గత ప్రభుత్వ హయాంలో గ్రామల్లో అభివృద్ధి పనులు చేపట్టిన వారికి బిల్లులు తక్షణమే చెల్లించాలని... నాదెండ్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నాదెండ్ల మండల పరిధి.. సాతులూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం నిమిత్తం సుమారు 22 లక్షల రూపాయలు నిధులు మాజీమంత్రి పుల్లారావు సహకారంతో మంజూరు చేశారని, ఆ నిధులతో ప్రహరీ గోడ సుమారు 75 శాతం పూర్తి చేశామన్నారు. దానికి రూ.10.50 లక్షలు పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేక అధికారి అకౌంట్లో ఏడాది క్రితం డబ్బు జమ అయినప్పటికీ... ఇంత వరకు వాటిని డ్రా చేసి ఇవ్వలేదని వాపోయారు.
ప్రహరీ గోడ నిర్మాణం పని చేసిన బండారుపల్లి హనుమంతరావుకి డబ్బు డ్రా చేసి ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని, ప్రత్యేక అధికారిని అనేకమార్లు కోరినా ఫలితం లేదన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడిన వారిని ఇబ్బందులకు గురి చేయకుండా... తక్షణమే బిల్లులను సంబంధిత వ్యక్తులకు చెల్లించాలని ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండీ... వాతావరణం: ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక