ETV Bharat / state

పోలీసులకు ‘రీ ఓరియంటేషన్’ క్లాసులు అవసరం: వర్ల రామయ్య - Varla Ramaiah media conference

TDP politburo member Varla Ramaiah: రాష్ట్రంలో జగన్ పాలన వచ్చాక.. పోలీస్ వ్యవస్థలోని 50శాతం పోలీసు అధికారులకు ‘రీ ఓరియంటేషన్’ క్లాసులు అవసరం అని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు ఆరోపించారు. పోలీసుకు వారి విధులు, బాధ్యతలు మరోసారి గుర్తుచేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ రెండుగా చీలిపోయింది.. ఒకటి అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరించేదైతే.. రెండోది చట్టబద్ధంగా నడుచుకునేదని తెలిపారు.

TDP politburo member Varla Ramaiah
TDP politburo member Varla Ramaiah
author img

By

Published : Feb 20, 2023, 7:55 PM IST

TDP politburo member Varla Ramaiah: నాలుగేళ్ల జగన్ పాలనను బేరీజు వేస్తే, పోలీస్ వ్యవస్థలోని 50శాతం అధికారులకు ‘రీ ఓరియంటేషన్’ క్లాసులు తప్పనిసరని అర్థమైందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వారు వ్యవహరిస్తున్న తీరు చూశాక, వారి విధులు, బాధ్యతలు, చట్టాల అమలు, ఏపీ పోలీస్ మాన్యువల్, సీఆర్​పీసీ, ఇండియన్ పీనల్ కోడ్ వంటి వాటిగురించి మరలా ‘రీఓరియంటేషన్’ క్లాసులు పెట్టి, వారి విధులు, బాధ్యతలు మరోసారి గుర్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అనపర్తిలో చంద్రబాబుని అడ్డుకోవడానికి పోలీసులే ఆయన వాహనశ్రేణి ముందు కూర్చున్న తీరు చూశాక, ఏపీ పోలీస్ వ్యవస్థను ఎవరు కాపాడతారనే అభిప్రాయం ప్రతిఒక్కరికీ కలిగిందని అన్నారు. సంవత్సరకాలంగా డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి తెలుగుదేశంపార్టీకి ఒక్కరోజు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ రెండుగా చీలిపోయిందన్న వర్ల రామయ్య.., ఒకటి అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించేదైతే, రెండోది చట్టబద్ధంగా నడుచుకునేదని తెలిపారు.

జగన్ ప్రభుత్వం ప్రాంరంభం అయిన దగ్గర నుండి కొంతమంది పోలీసు అధికారుల శైలి అభ్యంతరంగా ఉంది. వారి వ్యవహారం చట్టబద్దంగా లేదు. చట్టానికి వ్యతిరేఖంగా వ్యవహరిస్తున్నారు. నాలుగేళ్ల జగన్ పాలననలో పోలీస్ వ్యవస్థలోని 50శాతం పోలీసులకు ‘రీఓరియంటేషన్’ క్లాసులు కావాలి.. రాష్ట్రంలో వారు వ్యవహరిస్తున్న తీరుచూశాక, వారి విధులు, బాధ్యతలు, చట్టాల అమలు, వంటి వాటి గురించి మరలా ‘రీఓరియంటేషన్’ క్లాసులు పెట్టి, వారి విధులు, బాధ్యతలు మరోసారి గుర్తుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రీఓరియంటేషన్ క్లాసులు పెట్టకపోతే భవిష్యత్​లో కూడా ఇదే కరెక్ట్​ అనుకునే ప్రమాదం ఉంది. అప్పట్లో డీజీపీ గౌతమ్​ సవాంగ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రోజంతా డీజీపీ స్థాయిలో నిలబడి ఉండి.. ఆయనతో 151 సీఆర్పీసీ అంటే ఏంటని చదివిచ్చారు. ఎందుకంటే రీ ఓరియంటేషన్ అవసరం అని అదే ఇంకోక పోలీసు అయితే రాజీనామా చేసి వెళ్లి పోతారు. చంద్రబాబు విశాఖ వెళ్తే ఎయిర్​పోర్టులో ఆపేశారు. ఏ చట్టంతో ఆపేశారో అర్ధం కావట్లేదు.- వర్ల రామయ్య, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.