ప్రతిపక్ష నాయకులపై పెడుతున్న కేసుల గురించి ఉన్న శ్రద్ధ... రైతుల సమస్యలపై ముఖ్యమంత్రికి లేదని తెదేపా నేతలు ఆరోపించారు. గత ఏడాది అధిక వర్షాలతో పసుపు, మిర్చి దెబ్బతిన్నాయని.. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆలపాటి రాజా విమర్శించారు. నష్టాలతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని.. రైతులను ఆదుకునే వారు కరవయ్యారని ఆరోపించారు.
తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు, గుంటూరు తెదేపా పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ రైతులతో కలిసి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. దెబ్బతిన్న పంటలకు వెంటనే ప్రభుత్వం పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. పంటల కొనుగోలుపై సీఎం హామీ నోటి మాటగానే మిగిలిందని.. తక్షణమే అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలని.. ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: