ETV Bharat / state

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం- కార్యకర్తలకు దిశానిర్దేశం - అమరావతి లేటెస్ట్ న్యూస్

TDP Parliamentary Party Meeting: ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయన అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంట్‌లో ఎండగట్టేలా పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

TDP_Parliamentary_Party_Meeting
TDP_Parliamentary_Party_Meeting
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 9:41 AM IST

Updated : Dec 1, 2023, 10:00 AM IST

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం- కార్యకర్తలకు దిశానిర్దేశం

TDP Parliamentary Party Meeting: రాష్ట్రంలో నెలకొన్న కరవు, వ్యవసాయ సంక్షోభాన్ని పార్లమెంట్‌ ఉభయ సభల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అజెండాగా తెలుగుదేశం పార్టీ సమావేశం జరగనుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగే ఈ భేటీలో.. పార్లమెంట్‌లో గళమెత్తేందుకు సుమారు 13 అంశాలపై ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

రాష్ట్రంలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ..పెద్ద ఎత్తున ఓట్ల అక్రమాకు తెరలేపిందనే అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంపీలు, ముఖ్యనేతలు సమన్వయం చేసుకునేలా ప్రణాళిక రూపొందించారు. వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాల వల్ల రాష్ట్రంలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోవడం.. మహిళలకు భద్రత కరవు, విభజన హామీలు అమలు కాకపోవడం వంటి పరిణామాలు జరుగుతున్నాయని వివరించనున్నారు.

తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు దంపతులు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ(Visakha Steel Plant Privatization) నిలుపుదల చేయటంతోపాటు రాష్ట్రంలో ధరల స్థిరీకరణ, కేంద్ర ప్రాయోజిత పథకాల సక్రమ అమలు వంటి అంశాలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లేలా ఎంపీలకు చంద్రబాబు సూచనలు చేయనున్నారు. ఈనెల 2న జరిగే అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు, లోకేశ్​లపై అక్రమ కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందనే అంశాన్ని వివిధ పార్టీల దృష్టికి తీసుకెళ్లాలని తెలుగుదేశం నేతలు యోచిస్తున్నారు.

TTD Chief Nara Chandrababu Visited Tirumala Temple: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు రేణిగుంట ఎయిర్ పోర్ట్​లో పార్టీ నేతలు, కార్యకర్తలు గురువారం ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్​లోని నివాసం నుంచి కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు.. గురువారం రాత్రికి తిరుమలలో బస చేశారు.

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం - రేపు తిరుమల శ్రీవారి దర్శనం

CBN Family at TTD: ఈరోజు ఉదయం చంద్రబాబు.. సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద చంద్రబాబుకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో చంద్రబాబు దంపతులకు ఆశీర్వచనం చేసిన వేదపండితులు.. శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

TDP Parliamentary Party Meeting at Amaravati: తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు అమరావతికి చేరుకోనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రజలకు సేవ చేసే శక్తి, సామర్థ్యలు ఇవ్వాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారే కాపాడారన్న ఆయన.. ధర్మాన్ని కాపాడాలని స్వామివారిని ప్రార్థించానన్నారు.

ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని, తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా ఉండాలని ఆయన అన్నారు. ఈ క్రమంలో త్వరలోనే తన కార్యాచరణను ప్రకటిస్తానని చంద్రబాబు వెల్లడించారు. డిసెంబర్ 2న విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్న చంద్రబాబు.. డిసెంబర్ 3న సింహాచలం అప్పన్న ఆలయానికి వెళ్లనున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 5వ తేదీన శ్రీశైలం మల్లన్నను చంద్రబాబు దర్శించుకోనున్నారు.

వైసీపీ త‌ప్పుడు కుట్రలు న్యాయం ముందు బ‌ద్దల‌య్యాయి: నారా లోకేశ్

Last Updated : Dec 1, 2023, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.