గుంటూరు జిల్లా వినుకొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా వార్డును.. నరసరావుపేట పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 25 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేస్తామన్న ఫ్రభుత్వం.. 15 కూడా చేయలేదన్నారు. కరోనా వైద్య సేవలు అందక రోగులు ఇబ్బంది పడుతున్నారని.. రూ.3 నుంచి 5 వేల వరకు మందులు బయట నుంచి కొనుగోలు చేసుకోవడం దారుణమన్నారు.
కొవిడ్‌తో వేలాదిమంది ప్రాణాలు కోల్పోతుంటే.. ముఖ్యమంత్రి బయటకు రాకపోవడం శోచనీయమని చెప్పారు. ఆర్భాట ప్రకటనలు తప్ప.. ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించడం లేదని ఆరోపించారు.
ఇదీ చదవండి: 'ప్రైవేట్'లో ఆక్సిజన్ కొరత!