ETV Bharat / state

ప్రతిపక్ష పార్టీనే లేకుండా చేయాలనే వైసీపీ టార్గెట్: అచ్చెన్నాయుడు - Telugu latest news

Atchannaidu Comments: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వం తీరు పట్ల తీవ్రంగా మండిపడ్డారు.. వైసీపీ అరాచకాలను ఎండగట్టే ఏ ఇతర పార్టీలను రాష్ట్రంలో లేకుండా చేయాలని సీఎం జగన్‌ పథకం రచించి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు..

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు
author img

By

Published : Jan 20, 2023, 7:37 AM IST

ప్రతిపక్ష పార్టీనే లేకుండా చేయాలనే వైసీపీ టార్గెట్: అచ్చెన్నాయుడు

Atchannaidu Comments: రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదన్నట్లు సీఎం జగన్‌ వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏపీని అన్ని విధాలుగా అధోగతి పాలు చేసిన వైసీపీ ప్రభుత్వంపై.. ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.. తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు అన్ని నియోజకవర్గాల ఇన్​చార్జ్​లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో.. ఆ పార్టీ నియోజకవర్గ పరిశీలకులతో అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా ఉన్న సమస్యల్ని సమష్టిగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.., అవసరమైతే టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని వారికి సూచించారు.

మొదటి శాసనసభలో జగన్మోహన్ రెడ్డి స్పీచ్ విన్నాను.. ఎంటి వీళ్లు 151 సీట్లు గెలిచారు. వీళ్ల స్పీచ్ చూస్తే ఎవరు ఇంతవరకు మాట్లాడలేదు.. మన పార్టీ భవిష్యత్తు ఎంటని భయపడ్డాను.. అంతనీతి మాటలు మాట్లాడారు.. కానీ మాటలకి చేతలకి పొంతన లేదు.. అబద్దానికి ప్యాంటు, షర్టు వేస్తే ఎమిటో జగన్మోహన్ రెడ్డి అబద్దాలకి ఒక కేర్ ఆఫ్ అడ్రాస్.. మూడున్నర సంవత్సరాలు అభివృద్ధి చేసి, సంక్షేమాలు ఇచ్చి, పార్టీ బలపడాలంటే అది మంచి విధానం.. కానీ కక్ష గట్టి.. తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు పెట్టి అసలు ఆంధ్రప్రదేశ్​లో తెలుగుదేశం పార్టీయే ఉండకూడదు.. మిగిలినటువంటి రాజకీయ పార్టీనే ఉండకూడదు.. ఒకే ఒక పార్టీ వైసీపీ పార్టీనే ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు ప్రారంభించారు.. అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు

ఇవీ చదవండి

ఉద్యోగుల టీఏ, డీఏల కోసం మరో సలహాదారుడ్ని నియమిస్తారా..?: హైకోర్టు

'కిర్పాల్​ను నియమించండి'.. మరోసారి సిఫార్సు చేసిన సుప్రీం కొలీజియం

అతియా-రాహుల్‌ పెళ్లి వేదిక అదిరిపోయిందిగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.