రాష్ట్రంలో పెరిగిన ధరలను నిరసిస్తూ తెదేపా, తెలుగు యువత నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. పెరిగిన పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలకు వ్యతిరేకంగా నరసరావుపేటలో తెదేపా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఎడ్లబండ్లు, సైకిళ్లను నడుపుతూ నిరసన తెలిపారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి తెదేపా నాయకులు నిరసన తెలిపారు.
తెదేపా హయాంలో ప్రశాంతంగా బతికిన ప్రజలు.. ప్రస్తుత వైకాపా ప్రభుత్వంలో కష్టాలు అనుభవిస్తున్నారని నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. ఏ దేశంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన నడుస్తోందని విమర్శించారు. ఏ రాష్ట్రంలో కూడా పెరగని విధంగా నిత్యావసర ధరలు ఒక్క ఆంధ్రప్రదేశ్లో పెరిగాయన్నారు. పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడుతున్నా.. సీఎం జగన్మోహనరెడ్డికి కనిపించక పోవడం విడ్డూరం అన్నారు.
ఇదీ చదవండి: JANASENA: అక్టోబర్ నాటికి పరిస్థితి మారకపోతే.. మేమే రోడ్లు వేస్తాం: నాదెండ్ల