TDP leaders on Jaganasura Rakta Charitra: "జగన్ నరహంతక పాలనకు చరమ గీతం పాడదాం - ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం" నినాదంతో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో 'జగనాసుర రక్తచరిత్ర' పేరిట ఆ పార్టీ నేతలు పుస్తకాన్ని విడుదల చేశారు. వివేకా హత్య కేసులో వేళ్లన్నీ జగన్-భారతీరెడ్డి కుటుంబం వైపే చూపుతున్నాయని పుస్తకంలో పేర్కొన్నారు. బాబాయ్ గొడ్డలి పోటులో.. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అన్నీ అబ్బాయేనని నేతలు ఆరోపించారు. వివేకా హత్య జరిగిన రోజు.. నవీన్ ఫోన్ ద్వారా వైఎస్ భారతి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ ద్వారా జగన్‌తో మాట్లాడానని అవినాష్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్ వివరాలను పుస్తకంలో పేర్కొన్నారు. సీబీఐ ఛార్జ్‌షీట్, వివేకా కుమార్తె సునీత అఫిడవిట్స్, అప్రూవర్ దస్తగిరిల వాంగ్మూలాలను పుస్తకంలో పొందుపరిచారు.
వివేకా హత్య వివరాలు ప్రతీ ఒక్కరికీ తెలిసేలా.. ప్రతీ ఇంటికీ పుస్తకాన్ని తీసుకెళ్తామని నేతలు స్పష్టం చేశారు. "జగనాసుర విముక్త ఆంధ్రప్రదేశ్ " లక్ష్యంతో సీఎం రక్త చరిత్రను బహిర్గతం చేశామన్నారు. వివేకాను 3గంటల పాటు చిత్రహింసలకు గురిచేసి గొడ్డలితో నరికి చంపారన్న నేతలు.. హత్యకు ఒప్పందం కుదిరిన రూ.40కోట్లు ఇచ్చే స్థోమత ఎవరికి ఉందో బహిర్గతం కావాలన్నారు. వివేకా హత్య రోజే జగన్, భారతీల వద్ద అర్ధరాత్రి వేళ.. కృష్ణమోహన్ రెడ్డి, నవీన్‌ల ఫోన్లు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. హత్య కేసు నుంచి బయటపడేందుకు సొంత తల్లి, చెల్లినీ జగన్ తరిమేసి వైఎస్ కుటుంబ సభ్యుల్ని దూరం పెట్టారని విమర్శించారు.
జగన్ సూత్రధారి కాబట్టే గంటకు లక్షల రూపాయలు తీసుకునే ప్రముఖ న్యాయవాదులు.. నిందితుల పక్షాన వాదిస్తున్నారని విమర్శించారు. సీబీఐ అధికారులు కేసును విచారించకుండా వారిపైనే ఎదురు కేసులు పెట్టారని మండిపడ్డారు. చెల్లెలు సునీతను జగన్ బెదిరించారని ఆరోపించారు. జగన్ ప్యాలెస్ లోనే వివేకా హత్యకు పథక రచన జరిగిందని విమర్శించారు.
హంతకులు ఏ స్థాయిలో ఉన్నా.. వారికి శిక్ష పడకపోతే రాష్ట్రంలో ఎవరికీ రక్షణ ఉండదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు గురికాకుండా హత్య కేసులో సూత్రధారులైన నేతల్ని సీబీఐ.. న్యాయస్థానం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలంటే సైకో పోయి, సైకిల్ రావాలన్నారు.
వివేకా హత్య కేసులో వేళ్లన్నీ జగన్-భారతీరెడ్డి కుటుంబం వైపే చూపుతున్నాయి. బాబాయ్ గొడ్డలి పోటులో.. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అన్నీ అబ్బాయే. వివేకా హత్య జరిగిన రోజు.. నవీన్ ఫోన్ ద్వారా వైఎస్ భారతి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ ద్వారా జగన్‌తో మాట్లాడానని అవినాష్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్ వివరాలను పుస్తకంలో పేర్కొన్నారు. సీబీఐ ఛార్జ్‌షీట్, వివేకా కుమార్తె సునీత అఫిడవిట్స్, అప్రూవర్ దస్తగిరిల వాంగ్మూలాలను పుస్తకంలో పొందుపరిచారు. -టీడీపీ నేతలు
ఇవీ చదవండి: