ETV Bharat / state

'వైకాపా నేతలు పంచ భూతాలను పంచుకుతింటున్నారు' - ఏపీలో ఇసుక అక్రమాలు

వైకాపా నేతలు పంచ భూతాలను పంచుకుతింటున్నారని తెలుగుదేశం ధ్వజమెత్తింది. ఇసుక పాలసీపై ఏడాదిగా ప్రజలు గగ్గోలు పెడుతుంటే దోపిడీకి అడ్డాగా దానిని మలుచుకున్నారని పార్టీ నేతలు దుయ్యబట్టారు. మూడు అక్రమాలు... ఆరు అన్యాయాలతో జగన్ విధ్వంస పాలన సాగిందని నేతలు ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి రంగు పడిందని తెలుగుదేశం నేతలు ఎద్దేవా చేశారు.

TDP LEADERS
TDP LEADERS
author img

By

Published : Jun 3, 2020, 5:30 PM IST

ప్రజలకు నవరత్నాలు పంచుతామని వైకాపా నేతలు పంచ భూతాలను పంచుకుతింటున్నారు. చివరికి ఇసుక, మట్టిని కూడా అమ్ముకుంటున్నారు. రీచ్​లో ఎత్తిన ఇసుక ఇంటికి చేరకుండా మధ్యలోనే మాయమవుతోందని వైకాపా ఎమ్మెల్యేలే చెప్తున్నారంటే ఇసుక దోపిడీ ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. ఇసుక దోపిడికి అడ్డుకట్ట వేయాలి... లేదంటే ఇసుక తుపానులో వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం- కళా వెంకట్రావు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

రాష్ట్రంలో దొంగలు పడి దోచేస్తున్నారు. సామాన్యులకు దొరకని ఇసుక అంతా... ఎక్కడికి వెళ్తోంది. ఆన్​లైన్ అని చెప్పి మళ్లీ వెంటనే మూసివేయడం ఏంటి - గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెదేపా సీనియర్ ‌నేత

నాలుగు వారాల్లో రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇకనైనా రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవటం మానుకోవాలి- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి

వేలకోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి వైకాపా రంగులు వేశారు. ఖర్చు పెట్టిన వేల కోట్లు ఖజానాకు చెల్లించాలని ప్రజలు అడుగుతున్నదానికి జగన్‌ సమాధానం చెప్పాలి. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ధిక్కరించి దోచేస్తున్న లక్షలాది టన్నుల ఇసుక దోపిడీపై జగన్‌ నోరు విప్పాలి - దేవినేని ఉమా, మాజీ మంత్రి

కరోనా విపత్తు సయమంలో ప్రజల క్షేమాన్ని మరచి రంగుల కోసం జగన్ పాకులాడారు. రాష్ట్ర ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి - నిమ్మల రామానాయుడు, టీడీఎల్పీ ఉపనేత

వైకాపా ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో రంగు పడింది. న్యాయ వ్యవస్థలను ఢీ కొట్టాలనే ఆలోచన ఇకనైనా మానుకోవాలి. కోర్టు ఖర్చుల కోసం కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారు - వర్ల రామయ్య, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు

ఇదీ చదవండి

రంగులు తొలగించకుండా తప్పు చేశారు:సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.