కార్మికుల దినోత్సావాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడేపల్లి తెదేపా నేతలు పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లను ఘనంగా సన్మానించారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు సేవలు అందిస్తున్న కార్మికులను సత్కరించాలన్న పార్టీ నిర్ణయం మేరకు 20 మందిని శాలువాతో సత్కరించినట్లు నేతలు తెలిపారు. ఒక్కొక్కరికి 20రోజులకు సరిపడా సరకులు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో తయారు చేసిన మాస్కులు, శానీటైజర్లను అందించారు. లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న ఒక్కో కార్మికుడికి ప్రభుత్వం రూ.5వేలు ఆర్థిక సాయం అందజేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.
కరోనా కాలంలో సేవలందిస్తున్నవారికి తెదేపా నేతల సన్మానం - Tdp leaders masks distribution news in thadepalli
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లను మేడే సందర్భంగా తెదేపా నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి 20రోజులకు సరిపడా సరకులను కార్మికులకు అందజేశారు.
కార్మికుల దినోత్సావాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడేపల్లి తెదేపా నేతలు పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లను ఘనంగా సన్మానించారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు సేవలు అందిస్తున్న కార్మికులను సత్కరించాలన్న పార్టీ నిర్ణయం మేరకు 20 మందిని శాలువాతో సత్కరించినట్లు నేతలు తెలిపారు. ఒక్కొక్కరికి 20రోజులకు సరిపడా సరకులు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో తయారు చేసిన మాస్కులు, శానీటైజర్లను అందించారు. లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న ఒక్కో కార్మికుడికి ప్రభుత్వం రూ.5వేలు ఆర్థిక సాయం అందజేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: విశాఖ మన్యంలో మేడే వేడుకలు