'వరదల పేరు చెప్పి... వైకాపా సీన్ మార్చేసింది' మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై ఇద్దరు యువకులు డ్రోన్ ఎగరవేయడం వెనుక సీఎం జగన్ కార్యాలయ హస్తముందని తెదేపా నేతలు ఆరోపించారు. తెదేపా నేతలు జీవీ అంజనేయులు, వర్ల రామయ్య, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, అశోక్ బాబు, రామకృష్ణ డీఐజీని కలిసి వినతిపత్రం అందించారు. డ్రోన్ ఎగురవేయడానికి ఐజీ స్థాయి అధికారి అనుమతి లేదని గుర్తు చేసిన వర్ల రామయ్య... వరదల పేరు చెప్పి వైకాపాకు అనుకూలంగా సీన్ మార్చారని ఆరోపించారు. చంద్రబాబు ఇంటిపై వైకాపా నేతలు పెడుతున్న దృష్టి.... పరిపాలనపై లేదని తెదేపా నేత ఆంజనేయులు ఎద్దేవా చేశారు. ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు.